రాంకీ వద్దు.. సీఎంసీ ముద్దు
రాంకీ సంస్థ తీరును వ్యతిరేకిస్తూ ‘రాంకీ వద్దు.. సీఎంసీ ముద్దు’ అంటూ ఇంటింటి చెత్త సేకరణ కార్మికులు మియాపూర్ సరిల్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీప్తిశ్రీ నగర్ డంప్ యార్డులో చెత్తను పోసి అకడే ప్లాస్టిక్, అట్టలు, సీసాలు వంటి స్రాప్ ను వేరు చేసుకుని విక్రయించడం ద్వారా అదనపు ఆదాయంవస్తుందని తెలిపారు.
- చెత్త సేకరణ కార్మికుల ఆందోళన
కొండాపూర్, ఆగస్టు 4: రాంకీ సంస్థ తీరును వ్యతిరేకిస్తూ ‘రాంకీ వద్దు.. సీఎంసీ ముద్దు’ అంటూ ఇంటింటి చెత్త సేకరణ కార్మికులు మియాపూర్ సరిల్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీప్తిశ్రీ నగర్ డంప్ యార్డులో చెత్తను పోసి అకడే ప్లాస్టిక్, అట్టలు, సీసాలు వంటి స్రాప్ ను వేరు చేసుకుని విక్రయించడం ద్వారా అదనపు ఆదాయంవస్తుందని తెలిపారు. ప్రస్తుతం డంప్ యార్డులో చెత్త వేరు చేయడానికి అనుమతించడం లేదని, చెత్తను నేరుగా డంప్ చేసి వెళ్లిపోవాలని రాంకీ సంస్థ అధికారులు ఆదేశిస్తున్నారని ఆరోపించారు.
జోనల్ హెడ్ రామకృష్ణ, అశోక్ రెడ్డి హ్యూమన్ రైట్స్ పేరుతో డంప్ యార్డులో చెత్త వేరు చేయడాన్ని నిలిపివేస్తున్నారని, ఎకడి చెత్త అకడే సెగ్రిగేషన్ చేయాలి, డంప్ యార్డులో చేయొద్దని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్ మెంట్లు, కాలనీల్లో చెత్త వేరు చేసుకునేందుకు తగిన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సుమారుగా వెయ్యి మంది చెత్త సేకరణ కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ఇంటింటి చెత్త సేకరణ ద్వారా వచ్చే పారితోషికం కుటుంబ పోషణకు సరిపోదని, స్రాప్ విక్రయాల ద్వారానే జీవనం కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రతి శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నామని, అయినప్పటికీ తమ ఉపాధికి ఆటంకం కల్గించే నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

