రాజ్కోట్, మే 3: జాతిపిత మహాత్మా గాంధీపై గుజరాత్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రాణి రాజ్గురు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీని జిత్తులమారిగా అభివర్ణించిన ఆయన గాంధీ కంటే రాహుల్ గాంధీ ఎంతో మెరుగని, ఆయన స్వచ్ఛమైన మనసుతో ఔదార్యంతో ఉంటారని అన్నారు.
రాబోయే రోజుల్లో ఆయన మహాత్మునిగా అవతరించడం ఖాయమని పేర్కొన్నారు. మహాత్మునిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ను ప్రజలు క్షమించబోరని గుజరాత్ బీజేపీ ఉపాధ్యక్షుడు భారత్ బొగ్హరా విమర్శించారు.