న్యూఢిల్లీ, ఆగస్టు 6: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ(96) మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గత నెల మొదటి వారంలో కూడా ఆయన రెండు రోజుల పాటు దవాఖానలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు. అంతకుముందు ఎయిమ్స్లోనూ ఆయన చికిత్స పొందారు.