షిండే అనర్హత తేల్చండి!
మహారాష్ట్రలో కొనసాగుతున్న శివసేన చీలిక ఎపిసోడ్లో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక అడుగు వేసింది. రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఆయన క్యాంపు ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత ప్రొసీడింగ్స్‌పై నిర్ణయం తీసుకోవాలని మంగళవారం సుప్రీంకోర్టును కోరింది.
- సుప్రీంకోర్టును కోరిన ఠాక్రే వర్గం
- శివసేన కొత్త అధ్యక్షుడిగా షిండే
- షిండే వర్గానికి పార్లమెంటులోని శివసేన కార్యాలయం
న్యూఢిల్లీ/ముంబై, ఫిబ్రవరి 21: మహారాష్ట్రలో కొనసాగుతున్న శివసేన చీలిక ఎపిసోడ్లో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక అడుగు వేసింది. రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఆయన క్యాంపు ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత ప్రొసీడింగ్స్‌పై నిర్ణయం తీసుకోవాలని మంగళవారం సుప్రీంకోర్టును కోరింది. షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత ప్రొసీడింగ్స్‌పై వారం రోజులలోగా నిర్ణయం తీసుకొనేలా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు. షిండే, ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత అంశం డిప్యూటీ స్పీకర్ ముందు పెండింగ్‌లో ఉండగానే షిండే చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయించేందుకు 2022లో అప్పటి గవర్నర్ బీఎస్ కోశ్యారీ నిర్ణయం తీసుకోవడాన్ని ఠాక్రే వర్గం తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అనర్హత ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో ఉన్న వ్యక్తితో గవర్నర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చా? అని అన్నారు.
శివసేన చీఫ్‌గా ఏక్నాథ్ షిండే
శివసేన అధ్యక్షుడిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో నేతలు షిండేను ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తద్వారా మాజీ సీఎం ఉద్ధవ్, ఆయనతో పాటు ఉన్న 16 మంది ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేశారు. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలని మరో తీర్మానం చేశారు.
షిండే వర్గానికి శివసేన కార్యాలయం
పార్లమెంట్ హౌస్‌లోని శివసేన కార్యాలయాన్ని ఏక్‌నాథ్‌షిండే నేతృత్వంలోని వర్గానికి లోక్‌సభ సెక్రటేరియట్ కేటాయించింది. ఈ వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన నేపథ్యంలో ఈ కేటాయింపు జరిగింది.
కిరాయి హంతకుడితో
నన్ను చంపే కుట్ర: రౌత్
సీఎం ఏక్నాథ్ షిండే కొడుకు, ఎంపీ శ్రీకాంత్ షిండే తనను చంపడానికి ఠాణేకు చెందిన కిరాయి హంతకుడిని మాట్లాడినట్టు శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్రపై తగిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

