న్యూఢిల్లీ: బాలీవుడ్ మాజీ నటి, మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో గొప్ప ఊరట లభించింది. అమరావతి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసేందుకు ఆమెకు మార్గం సుగమం అయింది.
ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చి, ఆమె సర్టిఫికెట్‌ను పునరుద్ధరించింది. 2021లో బాంబే హైకోర్టు ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. దీనిపై ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీలు చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం ఆమె నామినేషన్ వేశారు.