భోపాల్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దురుసుగా ప్రవర్తించిన మాజీ ఎమ్మెల్యేను వారు కొట్టారు. (Former BJP MLA Beaten) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉజ్జయినీలోని మహిద్‌పూర్‌లో బీజేపీ కార్యక్రమం జరిగింది. ఉజ్జయినీ ఇన్చార్జి మంత్రి గౌతమ్ తెత్వాల్, ఎంపీ అనిల్ ఫిరోజియా పాల్గొన్న ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ చౌహాన్‌ను పార్టీ నేతలు ఆహ్వానించలేదు.
కాగా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడైన బహదూర్ సింగ్ చౌహాన్ ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడకు చేరుకున్నారు. వేదికపైకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆయన వారితో దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు చౌహాన్‌ను కొట్టారు. మిగతా నేతలు కల్పించుకుని సర్దిచెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | MP: Former BJP MLA Bahadur Singh Beaten Up By Party Workers At Ujjain MP Anil Firojiya’s Event In Mahidpur; Video Surfaces#MPNews #MadhyaPradesh pic.twitter.com/0jabCWYlX7
— Free Press Madhya Pradesh (@FreePressMP) November 29, 2024