బుధవారం 08 జూలై 2020
National - Jul 01, 2020 , 16:06:20

ప్రాణాలకు తెగించి జింక‌ను కాపాడిన ఫారెస్ట‌ర్ : వీడియో వైర‌ల్‌

ప్రాణాలకు తెగించి జింక‌ను కాపాడిన ఫారెస్ట‌ర్ :  వీడియో వైర‌ల్‌

అడ‌వులు, అక్క‌డ జీవించే వ‌న్య‌ప్రాణుల‌ను ర‌క్షించే బాధ్య‌త మ‌న‌కు ఎంతో ఉంది. అయితే.. వ‌న్య‌ప్రాణులను ర‌క్షించ‌డానికి ప్ర‌త్యేకంగా ఫారెస్ట‌‌ర్స్ ఉన్నారు. వారి ఎంత ఓర్పుతో ప‌నిచేస్తున్నార‌నేదానికి ఈ వీడియో చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. దీనిని ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుధా రామెన్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

గంగా బ్యారేజీలో ప‌డి ఒక జింక ఇరుక్కుపోయింది. దీనిని హైద‌ర్పూర్‌కు చెందిన చిత్త‌డి నేల ఫారెస్ట‌ర్ శ్రీ మోహ‌న్ యాద‌వ్ ర‌క్షించారు. ఒక వ్య‌క్తి పైనుంచి కింద‌కి తాడు వ‌దిలాడు. దాని సాయంతో ఫారెస్ట‌ర్ కింద‌కి దిగి చెత్త‌నంతా తొలిగించి జింక‌ను ర‌క్షించారు. 'చిత్తడి జింకలను కాపాడటానికి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. అలాంటి పచ్చని యోధులు మన అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి దేశవ్యాప్తంగా పగలు, రాత్రులు పనిచేస్తున్నారు. వారి ప్రయత్నాలను అభినందిస్తున్నాము'‌. అనే శీర్షిక‌తో సుధా రామెన్ షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోను 56.6k మంది వీక్షించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo