తిరువనంతపురం: కేరళలోని (Kerala) మళప్పురం (Malappuram) జిల్లాలో బావిలో (Well) పడిపోయిన ఓ ఏనుగును (Elephant) అటవీ అధికారులు రక్షించారు. మళప్పురం జిల్లాలోని రబ్బరు తోటలో (Rubber plantation) ఉన్న 15 అడుగుల లోతైన బావిలో ఓ ఏనుగు ప్రమాద వశాత్తు పడిపోయింది. బయటకు రావడానికి అది అష్టకష్టాలు పడింది. అయినా అందులో నుంచి బయటపడటానికి దానికి వీలుకాలేదు.
బావిలోనుంచి అరుపులు వినిపిస్తుండటంతో గమనించిన స్థానికులు అటవీ అధికారులకు (Forest officials) సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. జేసీబీ (JCB) సహాయంతో దానిని రక్షించారు. అప్పటికే అలసిపోయిన ఏనుగు కష్టంమీద అందులోనుంచి బయటకు వచ్చింది.
#WATCH | Kerala: A wild elephant, which fell into a 15-feet deep well inside a rubber plantation in the Malappuram district, was rescued by the forest officials after nearly three hours of strenuous efforts. (18.04) pic.twitter.com/b2YGitBSAJ
— ANI (@ANI) April 18, 2023