డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న.. 9 మంది వైద్యులు, విద్యార్థులు అరెస్ట్
సమాచారం తెలుసుకున్న పోలీసులు, సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు బుధవారం సంయుక్తంగా రైడ్ చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నీల్ కిషోరిలాల్ను పట్టుకున్నారు
బెంగళూరు: డ్రగ్స్ తీసుకోవడంతోపాటు అక్రమంగా రవాణా చేస్తున్న 9 మంది వైద్యులు, వైద్య విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరి నుంచి రెండు కేజీల డ్రగ్స్, మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ సంఘటన జరిగింది. భారత సంతతి బ్రిటన్ పౌరుడు నీల్ కిషోరిలాల్, 2006-07 మధ్య కాలంలో మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో డెంటల్ కోర్సు (బీడీఎస్) చదివాడు. 15 ఏళ్లుగా మంగళూరులో ఉంటున్న అతడు డెంటల్ కాలేజీకి చెందిన వైద్యులతోపాటు వైద్య విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న మంగళూరు పోలీసులు, సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు బుధవారం సంయుక్తంగా రైడ్ చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నీల్ కిషోరిలాల్ను పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న రూ.50,000 విలువైన రెండు కేజీల డ్రగ్స్, మొబైల్ ఫోన్లు, రూ.7,000 నగదు, ఒక బొమ్మ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా 9 మంది వైద్యులు, వైద్య విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. 22-32 ఏళ్ల మధ్య వయస్సున్న వారిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు మంగళూరు నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

