Life Imprisonment | పాక్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం.. బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్‌కు జీవిత ఖైదు
Life Imprisonment | పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం పని చేసిన బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. కీలకమైన సాంకేతిక సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణల కేసులో 14 ఏళ్లు కఠిన కారాగార శిక్షతోపాటు రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ముంబై: పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం పని చేసిన బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. (Life Imprisonment) కీలకమైన సాంకేతిక సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణల కేసులో 14 ఏళ్లు కఠిన కారాగార శిక్షతోపాటు రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర నాగపూర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఇంజినీర్‌గా నిశాంత్ అగర్వాల్ గతంలో పని చేశాడు. బ్రహ్మోస్ కేంద్రంలో నాలుగేళ్లు విధులు నిర్వహించాడు. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు కీలకమైన సాంకేతిక సమాచారాన్ని అతడు లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ (ఏటీఎస్) సంయుక్త ఆపరేషన్‌లో అతడ్ని అరెస్టు చేశారు.
కాగా, అధికారిక రహస్యాల చట్టం, ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో నిశాంత్ అగర్వాల్‌ను దోషిగా నాగపూర్ జిల్లా కోర్టు నిర్ధారించింది. 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 3,000 జరిమానా విధిస్తూ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంవీ దేశ్‌పాండే సోమవారం తీర్పు ఇచ్చారు. అయితే గత ఏడాది ఏప్రిల్‌లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిశాంత్ అగర్వాల్‌కు బెయిల్ మంజూరు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

