Mohan Bhagawat : వ్యక్తిగత ప్రయోజనాల కోసం హిందూ మతం మారకండి : మోహన్ భగవత్
Mohan Bhagawat : వ్యక్తిగతమైన ప్రయోజనాలను పొందేందుకు హిందూ మతం మార్చుకోవద్దని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. ఇలా మతం మార్చుకోవడం...

(Mohan Bhagawat) డెహ్రాడూన్ : వ్యక్తిగతమైన ప్రయోజనాలను పొందేందుకు హిందూ మతం మార్చుకోవద్దని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. ఇలా మతం మార్చుకోవడం చాలా పెద్ద తప్పన్నారు. ఏ కార్యక్రమం తలపెట్టినా పురుషుల హాజరు కోసం చూస్తున్నారని, అయితే, మహిళల సంఖ్య పెరిగినప్పుడే విజయం సాధ్యమవుతుందని చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమానికి మోహన్ భయ్యాజీ హాజరయ్యారు. విజయదశమి సందర్భంగా నిర్వహించిన సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో హాజురైన హిందూ కుటుంబాలను ఉద్దేశించి మోహన్‌జీ ప్రసంగించారు. హిందూ కుటుంబాలు కూడా తమ పిల్లలకు తమ మతం, సాంప్రదాయాల గురించి గర్వపడాలని నేర్పించడం లేదని విచారం వ్యక్తం చేశారు.
‘వేరు మతం అమ్మాయిని పెండ్లి చేసుకోవడం కోసం చాలా మంది హిందూ మతం మారుతున్నారు. ఇది ఎంత మాత్రమూ సరైంది కాదు. ఇలా మతం మారడం వలన హిందూ మతం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది’ అని మోహన్ భగవత్ హెచ్చరించారు. ఈ సందర్భంగా భగవత్, భారతీయ కుటుంబ విలువలు, వాటిని ఎలా సంరక్షించాలో సుదీర్ఘంగా ప్రసంగించారు. చాలా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పురుషులు మాత్రమే ఎలా కనిపిస్తారనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు.
హిందూ సమాజాన్ని ఏకం చేయడమే ఆర్ఎస్ఎస్ ఉద్దేశమని, అయితే మా కార్యక్రమాలు నిర్వహించేప్పుడు కేవలం పురుషులనే చూస్తాం అని చెప్పారు. అలా కాకుండా, కనీసం 50 శాతం మహిళలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారానే సమాజాన్ని ఉద్ధరించవచ్చునని, విజయాలు సాధించవచ్చునని హితబోధ చేశారు.
ఆర్ఎస్ఎస్ ఒత్తిళ్ల కారణంగా లవ్ జిహాద్ లేదా పెండ్లి కోసం జరుగుతున్న మత మార్పిడిలకు వ్యతిరేకంగా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు చట్టాలను తీసుకువచ్చిన నేపథ్యంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
డ్రీమ్11 వ్యవస్థాపకులపై కేసు నమోదు.. కారణం ఏంటంటే..?
లోకనాయకుడు.. జయప్రకాశ్ నారాయణ్
ప్రపంచాన్ని అనుసంధానించడంలో స్పేస్ది కీలకపాత్ర : ప్రధాని మోదీ
నార్వేజియన్ సోలార్ ప్యానల్ కంపెనీతో 6 వేల కోట్ల రిలయన్స్ ఒప్పందం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

