Uttam Nagar | ఉత్తమ్ నగర్లో ప్రార్థనల తర్వాత పోలీసులపై ముస్లింల పూలవర్షం
Uttam Nagar : న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉంది. శనివారం ఉదయం ప్రార్థనల తర్వాత ముస్లింలు పోలీసులపై పూలవర్షం కురిపించారు.
Uttam Nagar : న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉంది. శనివారం ఉదయం ప్రార్థనల తర్వాత ముస్లింలు పోలీసులపై పూలవర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు అక్కడ రంజాన్ వేడుకలు జరుగుతాయా, లేదా అనే సందేహాలు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు, సైనిక బలగాల భద్రత మధ్య రంజాన్ వేడుకలు జరిగాయి.
ఇటీవల హోలీ సందర్భంగా న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో తరుణ్ అనే యువకుడిని కొందరు హత్య చేసిన సంగతి తెలిసిందే. చిన్న ఘర్షణ యువకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటనతో ఉత్తమ్ నగర్లో కొద్ది రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పలువురు హిందువులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హత్యకు ప్రతిగా ఈద్ వేడుకల్ని అడ్డుకుంటామని కొందరు హెచ్చరించారు. ఈ వార్నింగ్స్ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. రంజాన్ వేడుకలు ఎలా జరుగుతాయో అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ, ఈ పరిస్థితిని సీరియస్గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా వివిధ బలగాలకు చెందిన భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా మోహరించారు. ఇరుపక్షాల మధ్య ఎలాంటి ఘర్షణా తలెత్తకుండా చూశారు.
After offering Eid ul Fitr prayers at the Uttam Nagar Eidgah in Delhi, Muslims showered rose petals on the police and security forces, expressing gratitude to the Delhi Police,
!#TejRan #Ad #BoF500 #deprem #RevengedLove #MPatWEF2026 #Zomato #ORomeo #ManipurStatehoodDay pic.twitter.com/vUA2gGWveV
— Nida Wadi (@nidawadi14) March 21, 2026
దీనిలో భాగంగా రంజాన్ రోజైన శనివారం మరింత భద్రత ఏర్పాటు చేశారు. దీంతో ఈ భద్రత మధ్య ముస్లింలు ఉదయం శాంతియుతంగా ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ వేడుకలు జరుపుకొన్నారు. దీంతో శాంతియుతంగా వేడుకలు జరిపేందుకు కారణమైన పోలీసులు, భద్రతా సిబ్బందిపైకి స్థానిక ముస్లింలు కొందరు పూలు చల్లి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు రాబోయే శ్రీరామ నవమి సందర్భంగా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కొనసాగించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Flower petals
- New Delhi
- Police
- RAF
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

