గువాహటి: అస్సాంలో వరద బీభత్సం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. ఈ దయనీయ పరిస్థితి శుక్రవారం మరింత తీవ్రరూపం దాల్చింది. 30 జిల్లాల్లోని 24.20 లక్షల మందిపై ఈ ప్రభావం పడింది. ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
కొండచరియ విరిగిపడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. 63,490.97 హెక్టార్ల సాగు భూములు నీట మునిగాయి. వర్షాల సంబంధిత ప్రమాదాల కారణంగా ఇప్పటివరకు 64 మంది మరణించారు.