బెంగళూరు : నగరంలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు ఆదివారం తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దట్టమైన పొగమంచు కురియడం వల్ల ఢిల్లీ వెళ్లవలసిన 7 విమానాలు సహా 44 విమానాలు బయల్దేరడం ఆలస్యమైందని, కొన్ని విమానాలు దిగడంలో జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు. బెంగళూరు సహా అనేక నగరాల్లో ప్రతికూల వాతావరణం ఉందని అధికారులు తెలిపారు.