Flight crash | ఎయిరిండియా విమాన ప్రమాదంలో కుట్ర కోణంపై దర్యాప్తు : కేంద్రం
Flight crash | ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదం (Flight accident) లో కుట్రకోణంపై కూడా దర్యాప్తు చేయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Union Govt) తెలిపింది.
Flight crash : ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదం (Flight accident) లో కుట్రకోణంపై కూడా దర్యాప్తు చేయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Union Govt) తెలిపింది. ఇటీవల గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad) లో AI-171 విమానం కూలిపోయి 279 మంది మరణించిన ఘటనలో కుట్ర కోణంపై కూడా తాము దృష్టి సారించామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ (Muralidhar Mohol) చెప్పారు.
ఈ విమాన ప్రమాదం కేసును ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ కేసు దర్యాప్తు చేస్తోందని మంత్రి తెలిపారు. పుణేలో జరుగుతున్న ఓ కాన్క్లేవ్లో మంత్రి మురళీధర్ మోహోల్ మాట్లాడారు. ప్రమాదం స్థలం నుంచి రికవరీ చేసిన బ్లాక్‌బాక్స్ AAIB ఆదీనంలో ఉందని, విశ్లేషణ కోసం దానిని విదేశాలకు పంపబోమని స్పష్టంచేశారు.
మంత్రి మాట్లాడుతూ.. ‘విమాన ప్రమాదంపై AAIB పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించింది. అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. కుట్ర ఏదైనా ఉందా..? అనే అంశంపై కూడా దృష్టిపెట్టారు. సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. రెండు ఇంజిన్లు ఒకేసారి విఫలం కావడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది అరుదైన కేసు. దర్యాప్తు నివేదిక వస్తే గానీ రెండు ఇంజిన్లు విఫలం అయ్యాయా..? లేక ఇంధన సరఫరాలో సమస్య తలెత్తిందా అనేది తేలుతుంది. బ్లాక్ బాక్స్‌లోని కాక్‌పీట్ వాయిస్ రికార్డర్లో పైలట్ల సంభాషణ నిక్షిప్తమై ఉంది. నివేదిక మూడు నెలల్లో వస్తుంది. ఇప్పుడే దానిపై మాట్లాడటం తొందరపాటు అవుతుంది’ అని మురళీధర్ చెప్పారు.
విశ్లేషణ కోసం బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపనున్నారనే ప్రచారాన్ని మంత్రి మురళీధర్ కొట్టిపారేశారు. అది ఎక్కడికీ పోదని, దర్యాప్తు సంస్థల కస్టడీలోనే ఉందని చెప్పారు. దేశంలో వినియోగిస్తున్న 33 డ్రీమ్‌లైనర్ విమానాలను డీజీసీఏ ఆదేశాల మేరకు క్షుణ్ణంగా తనిఖీలు చేశారని తెలిపారు. ప్రజలు ఇప్పుడు భయపడటం లేదని, వారు సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని అన్నారు.
Read More >>
భద్రాచలం ఆదివాసి మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు
పాకిస్థాన్ సైన్యానివి తప్పుడు ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన భారత్
భారత్ ట్రకోమా రహిత దేశం.. WHO ప్రకటించింది : ప్రధాని మోదీ
ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరదలతో 9 మంది గల్లంతు
జూలై 1 నుంచి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సమ్మె
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

