లాతూర్, ఆగస్టు 21 : ‘పాఠశాలలను సరిచేయండి’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఒక పాఠశాల సందర్శనలో కొన్ని విస్తుపోయే విషయాలు బయటపడ్డాయని సీజీపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఆసా ప్రాంతంలోని జిల్లా పరిషత్ పాఠశాలను గురువారం సందర్శించానని, అయితే ఇతర పాఠశాలల నుంచి తెచ్చిన విద్యార్థులను తరగతి గదిలో కూర్చోబెట్టారని ఆయన తెలిపారు.
తరగతి గదిలో ఉన్న విద్యార్థులు పాఠశాల రికార్డుల్లో నమోదై లేరని చెప్పారు. పాఠశాల ప్రాంగణంలో తనకు ఖాళీ మద్యం సీసాలు కన్పించాయన్నారు. తాగునీటి వసతి లేదని, కేవలం తన రాకకు ముందు మాత్రమే మరుగుదొడ్లు శుభ్రం చేశారన్నారు. పాఠశాలలను మెరుగుపర్చడానికి బదులుగా యంత్రాంగం ఇలా మోసానికి ఎందుకు పాల్పడుతన్నదని ఆయన ప్రశ్నించారు.