లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఓ రైస్ మిల్లు(Rice Mill)లో విషపూరిత వాయువు పీల్చిన అయిదుగురు మృతిచెందారు. బహరూచ్ జిల్లాలోని రాజ్ఘరియా రైస్ మిల్లులో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ దట్టమైన వాయువు రిలీజైంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దర్గా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. యూపీ ఫైర్ ఆఫీసర్ విశాల్ గోండ్ మాట్లాడుతూ.. రాజ్ఘరియా ఫుడ్స్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు తమకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని, రెండు ఫైర్ టెండర్లను అక్కడకు పంపించామని, డ్రయర్ నుంచి స్మోక్ వస్తున్నట్లు గుర్తించామని, ఎందుకు పొగ వస్తుందో తెలుసుకునేందుకు 8 మంది పైకి ఎక్కారని, ఆ పొగ వల్ల వాళ్లు స్పృహ కోల్పోయారని, అగ్ని మాపక సిబ్బంది వాళ్లను బయటకు తీసుకువచ్చిందని, స్పృహ కోల్పోయిన వారిని ఆస్పత్రికి తరలించారని, దాంట్లో అయిదుగురు మృతిచెందారని, ముగ్గురికి ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు తెలిపారు.
#WATCH | Bahraich, UP: Fire Officer Vishal Gond says, “I received information that fire broke out at Rajgarhiya Foods. We sent two fire tenders. We saw that smoke was coming out of the dryer. Eight people climbed up to check the cause of the smoke. They became unconscious because… pic.twitter.com/nnWNGdKpDd
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 25, 2025