Karnataka | కర్ణాటక (Karnataka)-కేరళ సరిహద్దుల్లో ఐదు పులులు మరణించాయి. మలై మహదేశ్వర వైల్డ్ లైఫ్ డివిజన్ (Malai Mahadeshwara Wildlife Division)లో తల్లి పులి, నాలుగు కూనలు మరణించాయి. వాటికి సమీపంలో ఓ ఆవు కళేబరాన్ని అధికారులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు విషం పెట్టడం వల్లే ఈ పులులు మృతి చెందినట్లు తెలుస్తోంది (Five Tigers Poisoned To Death). టైగర్ రిజర్వ్ లోపల పశువులను మేపుతున్న స్థానిక ప్రజల పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చనిపోయిన పులి కొన్ని రోజుల క్రితం ఒక ఆవును చంపినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆ పగతోనే సమీప గ్రామస్థులు ఆవు కళేబరంలో విషం కలిపి పులికి ఎర వేసి ఉంటారని భావిస్తున్నారు. ఆ కళేబరం తిన్న పులులు చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. శవపరీక్షలో కూడా విష ప్రయోగం వల్లే చనిపోయినట్లుగా తేలిందని చెప్పారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
కాగా, ప్రస్తుతం కర్ణాటకలో 563 పులులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత దేశంలో రెండో స్థానంలో పులుల సంఖ్య కర్ణాటకలోనే ఉంది. ప్రభుత్వ స్థాయిలో పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ పశుసంపదను కాపాడుకోవడానికి మృగాలపై విషప్రయోగానికి వెళ్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది.
ಚಾಮರಾಜನಗರ: ತಾಯಿ ಹುಲಿ ಹಾಗು ಮೂರು ಮರಿ ಹುಲಿಗಳ ಅಸಹಜ ಸಾವು. ಎಂ.ಎಂ.ಹಿಲ್ಸ್ ವನ್ಯಧಾಮದ ಮೀಣ್ಯಂ ವಲಯದಲ್ಲಿ ಘಟನೆ.
ವಿಷ ಪ್ರಶಾನ ಶಂಕೆ. ಸ್ಥಳಕ್ಕೆ ಅರಣ್ಯಾಧಿಕಾರಿಗಳ ದೌಡು. ಪಿಸಿಸಿಎಫ್ ನೇತೃತ್ವದಲ್ಲಿ ತನಿಖೆ ನಡೆಸಿ ವರದಿ ನೀಡಲು ಅರಣ್ಯ ಸಚಿವ ಈಶ್ವರ ಖಂಡ್ರೆ ಆದೇಶ. ಸಿಬ್ಬಂದಿ ನಿರ್ಲಕ್ಷ್ಯವಿದ್ದರೆ ಶಿಸ್ತು ಕ್ರಮ.
ವಿಷ ಪ್ರಾಶಾನವಾಗಿದ್ದರೆ… pic.twitter.com/huWTQrqZuF— JustKannada (@JustKannada) June 26, 2025
Also Read..
Floods | హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు.. 250 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్
Rath Yatra | జగన్నాథ రథయాత్రలో అపశృతి.. జనంపైకి ఏనుగు దూసుకెళ్లడంతో తొక్కిసలాట
Bomb Threat | ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉంది.. టిష్యూ పేపర్‌పై బెదిరింపు సందేశం