కోల్కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గురువారం రాత్రి ముషీరాబాద్ జిల్లా నబగ్రామ్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్థానిక ప్రాంత కార్యదర్శి హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం భంగోర్లో జరిగిన ఘర్షణల్లో ఏఐఎస్ఎఫ్ అభ్యర్థి, టీఎంసీ కార్యకర్త హత్యకు గురయ్యారు. మరోవైపు నార్త్ దింగజ్పూర్లో నామినేషన్ వేయడానికి వెళుతున్న సీపీఎం అభ్యర్థిని దుండగులు కాల్చి చంపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ గురువారం భంగోర్ను సందర్శించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.ఒకటి, రెండు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగానే కొనసాగుతున్నదన్నారు!