పూర్ణియా: బీహార్లో కొందరి అనుమానం ఒక కుటుంబంలోని ఐదుగురి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. గ్రామంలో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఓ కుటుంబంపై దాడి చేసిన ఒక మూక వారిని సజీవ దహనం చేసింది.
ఈ దారుణ ఘటన పూర్ణియా జిల్లాలోని టెగామా గ్రామంలో ఆదివారం జరిగింది. రాత్రి వేళ 50 మంది గుంపు సీతాదేవి అనే మహిళ ఇంటిపై హఠాత్తుగా దాడి చేసి కర్రలతో కొట్టి ఐదుగురికీ నిప్పంటించి సజీవ దహనం చేసింది. ఒకరు మాత్రం తప్పించుకోగలిగారు.