Wasps | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో ఊహించని ఘటన జరిగింది. పెళ్లి కార్యక్రమాల్లో (Wedding Rituals) భాగంగా ఆలయానికి వెళ్లిన ఓ కుటుంబంపై కందిరీగలు (Wasps) దాడి చేశాయి. ఈ దాడిలో ఒకే కుటుంబంలోని 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన హమీర్పూర్ (Hamirpur) జిల్లాలోని రక్కడ్ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ కుమారుడి వివాహ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు చేశారు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్దామనుకునేలోపు వారికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆలయ ప్రాంగణంలో అకస్మాత్తుగా వారిపై కందిరీగలు దాడి చేశాయి. ఈ దాడిలో వరుడు నవీన్ సింగ్ సహా మొత్తం 25 మంది గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా నదౌన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వరుడు సహా మిగిలిన వారిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడితో అప్పటి వరకూ ఎంతో సంతోషాలతో నిండిన ఆ ఇంట దుఃఖ వాతావరణం నెలకొంది. దాడి కారణంగా వివాహ కార్యక్రమాన్ని కొంతకాలం వాయిదా వేసుకున్నారు.
Also Read..
Puri Temple | పూరీ ఆలయంలో ఊహించని ఘటన.. శిఖరంపై ఎగిరే పతితపావన జెండాను ఎత్తుకెళ్లిన గద్ద.. VIDEO
Mehul Choksi | దోచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందే.. మెహుల్ చోక్సీ అరెస్ట్‌పై కేంద్రం