Puri Temple | ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రముఖ జగన్నాథ ఆలయం (Puri Jagannath Temple)లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎంతో పరమ పవిత్రంగా భావించే ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రంపై (Neela Chakra) ఎగిరే పతిత పావన జెండాను ఓ గద్ద (Eagle) ఎత్తుకెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గోపురంపై ఉన్న జెండాను గద్ద తన నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత సముద్రంవైపు వెళ్లిపోయింది. ఇది చూసిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొందరు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే, ఈ ఘటనపై ఆలయ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటనా జారీ చేయలేదు.
కాగా, పూరీకి వచ్చే భక్తులంతా తొలుత పతితపావన జెండా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఆలయంలో జగన్నాథుడి దర్శనం కోసం వెళ్తారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు ప్రతిరోజూ మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తారు. భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కడతారు.
This picture raise lots of questions!!! An eagle fled after taking Patitapabana flag from the top of the #Jagannattemple #puri pic.twitter.com/8Zlc74UUj0
— Ajay kumar nath (@ajaynath550) April 13, 2025
Also Read..
Mehul Choksi | దోచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందే.. మెహుల్ చోక్సీ అరెస్ట్‌పై కేంద్రం
Salman Khan | ఇంట్లోనే చంపుతాం.. సల్మాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు