AI Video | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence).. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇప్పుడు ఇది సర్వాంతర్యామి అయిపోయింది. ఏఐ ద్వారా వింతలు వినోదాలు సృష్టిస్తున్నారు. 20 ఏళ్ల వయసు వారిని 80 ఏళ్ల వృద్ధులుగా, క్రికెటర్లను పండ్లు అమ్ముకునే వాళ్లుగా, బిలియనీర్లను మురికివాడల్లో నివసించేవాళ్లుగా.. ఇలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా సృష్టించిన సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ యాడ్‌లో కనిపించే చిన్నారి బొమ్మ (Amul Girl), దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మహారాజా (Air India Maharaja) , పార్లేజీ బిస్కట్ పాపాయి, నిర్మా గర్ల్.. గతంలో ఈ కార్టూన్లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అయితే, ఈ బొమ్మలకు ప్రాణం పోస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు రూపమిచ్చాడు ఓ నెటిజన్. కృత్రిమ మేధ సాయంతో ఆ బొమ్మలతో ఓ వీడియో రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమూల్ బేబీ చిప్స్ తినడం, ఎయిర్ ఇండియా మహారాజా తన ప్రత్యేకమైన స్టైల్లో చిరునవ్వులు చిందించడం, నిర్మా గర్ల్ డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also Read..
Puri Temple | పూరీ ఆలయంలో ఊహించని ఘటన.. శిఖరంపై ఎగిరే పతితపావన జెండాను ఎత్తుకెళ్లిన గద్ద.. VIDEO
Mehul Choksi | దోచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందే.. మెహుల్ చోక్సీ అరెస్ట్‌పై కేంద్రం
CERT-In | మీ వాట్సాప్ ఎప్పుడైనా హ్యాక్ కావొచ్చు..! యూజర్లకు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్..!