న్యూఢిల్లీ, అక్టోబర్ 18: దాదాపు 15 ఏండ్ల కిందట జరిగిన టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. ఐదుగురుని దోషులుగా ప్రకటించింది. వీరికి ఈ నెల 26న శిక్షలు ఖరారు చేయనున్నది. 2008 సెప్టెంబర్ 30న సౌమ్య విశ్వనాథన్ ఆఫీసు నుంచి ఇంటికి కారులో వస్తుండగా హత్య జరిగింది. దొంగతనం చేయడానికే ఈ హత్య చేసినట్టు అప్పట్లో పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. విచారణ జరిపిన కోర్టు తాజాగా వీరిని దోషులుగా ప్రకటించింది.