న్యూఢిల్లీ : మోమోస్ ఇప్పుడు ప్రముఖ స్ట్రీట్ ఫుడ్ ఐటెమ్స్‌లో ఒకటిగా మారాయి. ఎన్నో వెరైటీలతో, టేస్టీ వెర్షన్స్‌తో మోమోస్ అందరినీ కట్టిపడేస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ఓ వ్యాపారి పైనాపిల్ మోమోస్ విక్రయిస్తున్న వీడియో (Viral Video) నెట్టింట వైరల్ కాగా పలువురు యూజర్లు ఆ వీడియోను ఓ రేంజ్లో ఆడుకున్నారు.
మోమోస్‌లో ఫ్రూట్స్‌తో ప్రయోగాలేంటని విరుచుకుపడ్డారు. ఇక లేటెస్ట్గా ఫిట్నెస్ వ్లాగర్ జిమ్ వాలా మోమోస్ గురించి ఇన్‌స్టా రీల్స్‌లో వీడియో చేయడంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కరణ్ వర్మ్ అనే వ్లాగర్ ఇన్స్టాగ్రాం రీల్‌ను షేర్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
వీడియోలో ముందుగా ఫిట్నెస్ వ్లాగర్ క్యాబేజ్‌ను వలుస్తూ ఆపై దాన్ని మరిగించిన నీటిలో వేస్తాడు. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, మష్రూమ్స్‌ను కట్ చేసి పన్నీర్ ఇతర పదార్ధాలను కలిపి మిశ్రమంగా చేస్తాడు. ఆపై సాల్ట్, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, పెప్పర్ జోడిస్తాడు. స్టఫ్ రెడీ అయిన తర్వాత వండిన క్యాబేజీ లీవ్స్లో వాటిని నింపుతాడు. ఇక నెయ్యిలో వాటిని ఫ్రై చేస్తాడు.
Read More
Air India Express | నయా లుక్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు.. ఫొటోలు వైరల్