న్యూఢిల్లీ: బోయింగ్ విమాన కంపెనీకి చెందిన 787 డ్రీమ్‌లైనర్ ఇలా కూలడం ఇదే మొదటిసారి అని విమానయాన నిపుణులు చెబుతున్నారు. అహ్మాదాబాద్‌లో ఇవాళ కూలిన విమానాన్ని 787-8 డ్రీమ్‌లైనర్‌గా గుర్తించారు. ఎయిర్ ఇండియా నడిపిస్తున్న ఆ విమాన మోడల్‌ను 2011లో ప్రవేశపెట్టారు. 14 ఏళ్ల క్రితం వచ్చిన ఆ విమానాన్ని డ్రీమ్‌లైనర్ మోడల్‌గా కూడా పిలుస్తారు. అమెరికా కంపెనీ డ్రీమ్‌లైనర్ విషయంలో ఇటీవల ఓ వేడుక కూడా నిర్వహించింది. డ్రీమ్‌లైనర్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల మంది ప్రయాణికులు ట్రావెల్ చేశారని మైలురాయి సంబరాలు కూడా జరుపుకున్నారు.
We are in contact with Air India regarding Flight 171 and stand ready to support them. Our thoughts are with the passengers, crew, first responders and all affected. pic.twitter.com/kYrdKyvl7z
— Boeing Airplanes (@BoeingAirplanes) June 12, 2025
787 మోడల్‌కు చెందిన విమానాలు ప్రస్తుతం 1175 వినియోగంలో ఉన్నాయి. ఆ విమానాలు ఇప్పటి వరకు 50 లక్షల ఫ్లయిట్ జర్నీలు చేశాయి. డ్రీమ్‌లైనర్ మోడల్ విమానాలు ఇప్పటి వరకు 3 కోట్ల ఫ్లయిట్ అవర్స్ ట్రావెల్ చేసినట్లు ఇటీవల బోయింగ్ కంపెనీ వెల్లడించింది. ఇవాళ గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదం.. బోయింగ్ కంపెనీకి చేదు జ్ఞాపకంగా మిగలనున్నది. ఇటీవల బోయింగ్ విమానాల్లో సమస్యలుగా ఎక్కువగా వస్తున్నాయి. 737 మోడల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇటీవల ఆ కంపెనీ విమానాలు పలు చోట్ల నేలకూలాయి. ప్రస్తుతం బోయింగ్ కంపెనీ సీఈవోగా కెల్లీ ఓర్ట్బర్గ్ ఉన్నారు. ఆయన పదవి చేపట్టి ఏడాది కూడా కాలేదు. తాజా దుర్ఘటన ఆయనకు ఇప్పుడు సవాల్‌గా మారనున్నది. బోయింగ్‌లో తలెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు ఆయన్ను తీసుకువచ్చారు.
అహ్మాదాబాద్ ప్రమాదంపై మరింత సమాచారాన్ని త్వరలో ఇవ్వనున్నట్లు బోయింగ్ కంపెనీ ఓ స్టేట్మెంట్లో పేర్కొన్నది. ప్రమాద సమయంలో .. విజిబిలిటీ క్లియర్‌గా ఉన్నట్లు తెలిసింది. వాతావరణం చాలా నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. వెదర్ చాలా స్టేబుల్‌గా, క్లియర్‌గా ఉన్నట్లు ఫ్లయిట్ సేఫ్టీ నిపుణుడు మార్కో చాన్ వెల్లడించారు. ప్రమాద సమయంలో గాలి వేగం చాలా స్వల్ప స్థాయిలో ఉందని, విజిబిలిటీ ఆరు కిలోమీటర్ల దూరం వరకు క్లియర్‌గా ఉన్నట్లు ఏవియేషన్ వెదర్ సంస్థ మెటార్ పేర్కొన్నది. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో మబ్బులు కానీ.. మరో ప్రమాకరమైన పరిస్థితి కానీ రిపోర్టు కాలేదన్నారు.
అహ్మాదాబాద్‌లో కూలిన విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ సజీవంగా లేరని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 242 మంది మరణించినట్లు ఇంకా అధికారికంగా ద్రువీకరించలేదు. దీనికి తోడు ఆ విమానం ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న డాక్టర్స్ హాస్టల్‌పై కూలింది. దీంతో ఆ హాస్టల్లో ఉన్న మెడికోలు కూడా మృతిచెందారు.