Fire accident : ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ (EV showroom) లో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ షోరూమ్‌లోని 50 ఎలక్ట్రిక్ బైకులు (Electric bikes) కాలిబూడిదయ్యాయి. బుధవారం ఉదయం రాజస్థాన్ (Rajasthan) లోని కోటా (Kota) లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను ఆర్పేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎలాంటి ప్రాణపాయం జరగలేదని చెప్పారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.