Fire accident : ఓ పారిశ్రామిక వాడ (Industrial Area) లోని వే బ్రిడ్జి (Weigh Bridge) పై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
కర్ణాటక రాష్ట్రం కలబురగిలోని కప్నూర్ పారిశ్రామిక వాడలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కాగా వే బ్రిడ్జిపై మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Karnataka: Fire broke out at Weigh Bridge premises in Kapnoor Industrial area in Kalaburagi. Several fire tenders reached the spot. Further details awaited. pic.twitter.com/cXeoiwzJJg
— ANI (@ANI) April 7, 2025