తిరువనంతపురం : కేరళలోని కోజికోడ్‌లో వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌లో ప్రమాదం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక, సహాయ, పునరావాస సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగుచూడాల్సి ఉంది. ఇక ఈరోజు ఉదయం కర్నాటకలోని మాండ్యలో నూతనంగా ప్రారంభించిన మెగా డైరీ యూనిట్లో అగ్నిప్రమాదం జరిగింది.
ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడటంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్నఅగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయని అధికారులు వెల్లడించారు.
Read More :
Nupur Sanon | కాలేజీ రోజుల్లో ప్రేమ పేరుతో చీట్ చేశాడు.. అసలు విషయం బయటపెట్టిన నుపుర్