Nupur Sanon | కాలేజీ రోజుల్లో ప్రేమ పేరుతో చీట్ చేశాడు.. అసలు విషయం బయటపెట్టిన నుపుర్
Nupur Sanon | సినిమాల్లోకి రాకముందే ఆమె ఫేమస్. గమకాలకు కొత్త గమనం నేర్పింది. సంగతులతో బంతాట ఆడుకుంది. తన ‘పాట’వానికి యూట్యూబ్‌ను వేదికగా ఎంచుకుంది. తన గానామృతంతో యూట్యూబ్ వీక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఆ మధుర గాయని పేరు నూపుర్ సనన్.
Nupur Sanon | సినిమాల్లోకి రాకముందే ఆమె ఫేమస్. గమకాలకు కొత్త గమనం నేర్పింది. సంగతులతో బంతాట ఆడుకుంది. తన ‘పాట’వానికి యూట్యూబ్‌ను వేదికగా ఎంచుకుంది. తన గానామృతంతో యూట్యూబ్ వీక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఆ మధుర గాయని పేరు నూపుర్ సనన్. సామాజిక మాధ్యమాల్లో సెలెబ్రిటీ హోదా దక్కించుకున్న ఆమె నటిగా బాలీవుడ్లో పాగా వేసింది. ఇప్పుడు రవితేజ హీరోగా వస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది.
‘వన్- నేనొక్కడినే’ సినిమాతో తెలుగువారికి పరిచయమైన అందాల తార కృతి సనన్‌కు నూపుర్ స్వయానా చెల్లెలు. ఢిల్లీలో పుట్టిపెరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి మ్యూజిక్‌లో పట్టా అందుకుంది. తర్వాత అవకాశాల కోసం ముంబైకి మకాం మార్చింది. తన కల నిజం చేసుకుంది.

2015లో నూపుర్ మ్యూజికల్ జర్నీ మొదలైంది. యూట్యూబ్‌లో ఆమె ప్రజెంట్ చేసిన ‘బేకరార్ కర్కే’ పాట లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. అదో సంచలనం. ఆ పాటతో నూపుర్ రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయింది. తర్వాత కూడా వరుసగా యూట్యూబ్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ.. వ్యూయర్ల మనసులు కొల్లగొట్టింది. తన అక్క కృతి సినిమాల్లో ఉన్నప్పటికీ.. నూపుర్ యాక్టింగ్ మీద పెద్దగా మనసు పారేసుకోలేదు. ఒకవేళ అవకాశం వస్తే సత్తా చూపడానికి నటనలో శిక్షణ కూడా తీసుకుంది.
2019లో ‘ఫిల్హాల్ 2’ సినిమాతో నూపుర్ తెరంగేట్రం చేసింది. అందులో సీనియర్ యాక్టర్ అక్షయ్‌కుమార్‌కు దీటుగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా రాకతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అందానికి మించిన అభినయంతో సినీలవర్స్ కలలరాణి అనిపించుకుంది. తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘టైగర్ నాగేశ్వర రావు’లో నాయికగా కనిపించనుంది. తన అక్క కృతి సనన్ లాగే తెలుగులో సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటానని చెబుతున్నది నూపుర్.

Nupur Sanon2
‘పాప్ కౌన్’ కామెడీ వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులకూ దగ్గరైంది నూపుర్. ‘అన్ని తరహా పాత్రల్లో మెప్పించినప్పుడే పరిపూర్ణ నటిగా గుర్తింపు సాధ్యమవుతుంది. ముఖ్యంగా కామెడీ పండించడం కష్టం. కెరీర్ ఆరంభంలోనే ‘పాప్ కౌన్’ సిరీస్ ద్వారా హాస్య ప్రధాన పాత్ర పోషించే అవకాశం రావడం అదృష్టమే! నా పెర్ఫార్మెన్స్కు మంచి రెస్పాన్స్ రావడంతో మరింత హ్యాపీగా ఫీలయ్యా’ అని గుర్తుచేసుకుంటుంది ఈ నటి.
“ప్రేమను వర్ణించడానికి మాటలు సరిపోవు.. అని భారీ భారీ డైలాగులు చెబుతుంటారు. అసలు నిర్వచనమంటూ ఉంటే కదా ప్రేమ గురించి చెప్పడానికి? నా కాలేజీ రోజుల్లో ఇదే ప్రేమ పేరుతో ఒకడు చీటింగ్ చేశాడు. అతనికి సరైన బుద్ధి చెప్పాను. అప్పటినుంచి ప్రేమ మీద నాకు నమ్మకం పోయింది’ అంటూ ఘాటుగా స్పందిస్తుంది నూపుర్.
“అందంగా ఉన్నావంటూ చాలామంది పొగుడుతుంటారు. అలా అనిపించుకోవడం గర్వంగా ఉంటుంది. కానీ, బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యం ఇస్తూ చేసే కామెంట్లు మనసును తాకవు. ఏదో పొగిడారు కాబట్టి ఆ క్షణం నవ్వుతూ స్పందిస్తా! కానీ, మానసిక సౌందర్యమే ప్రధానమైనది. దాన్ని అర్థం చేసుకున్నవాళ్లు ప్రత్యేకంగా కితాబు ఇచ్చి మన ప్రతిస్పందన ఆశించరు” అంటుంది నూపుర్.
Read More :
“Kriti Sanon Vs Nupur Sanon | అక్కాచెల్లెళ్ల బాక్సాఫీస్ పోరు.. క్రేజీ ఫైట్‌పై ఉత్కంఠ..!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

