Kriti Sanon | నన్ను హీరోయిన్గా ప్రకటించి.. లాస్ట్‌కి స్టార్ కిడ్స్ను తీసుకునేవాళ్లు .. నెపోటిజంపై స్పందించిన కృతి సనన్
Kriti Sanon | జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథాంశాల్ని ఎంచుకొని సినిమాలు చేస్తుంటుంది కథానాయిక కృతిసనన్. పదేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ భామ బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. హిందీ చిత్రసీమలోని బంధుప్రీతి, గుత్తాధిపత్యంపై తరచూ తన గళాన్ని వినిపిస్తుంటుంది కృతిసనన్.
Kriti Sanon | జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథాంశాల్ని ఎంచుకొని సినిమాలు చేస్తుంటుంది కథానాయిక కృతిసనన్. పదేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ భామ బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. హిందీ చిత్రసీమలోని బంధుప్రీతి, గుత్తాధిపత్యంపై తరచూ తన గళాన్ని వినిపిస్తుంటుంది కృతిసనన్. ఈ భామ బాలీవుడ్‌లోని బంధుప్రీతిపై గతంలో చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కెరీర్ ఆరంభంలో అవకాశాలపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆ వీడియోలో పేర్కొంది కృతిసనన్.
ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. మనసుకు నచ్చిన కథల్ని ఎంచుకొని కష్టపడితే విజయాలు తప్పకుండా వస్తాయని నేను నమ్ముతాను. అయితే ఆరంభంలో కొన్ని పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. తొలుత నన్ను హీరోయిన్గా ప్రకటించి.. సినిమా ఆరంభమయ్యే టైమ్‌లో నా స్థానంలో స్టార్కిడ్స్ను తీసుకున్నారు. ఇలా చాలా సార్లు జరిగింది. అయినా నేనెప్పుడూ బాధపడలేదు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకున్నా. జీవితంలో జరిగే ప్రతీ సంఘటనకు ఓ కారణం ఉంటుందని నేను నమ్ముతాను’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టి ‘దో పట్టి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నది.
Read More :
“Kriti Sanon | బంపరాఫర్ కొట్టేసిన కృతిసనన్.. ట్రాజెడీ క్వీన్ బయోపిక్‌లో నటించే ఛాన్స్!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

