Kriti Sanon | అదొక్కటి చేస్తే చాలు.. అంతకుమించిన కోరికలు లేవు
Kriti Sanon | సినిమా తారలు గ్లామర్ బొమ్మలనీ, వాళ్లకు ప్రపంచమే తెలియదనీ చాలామంది విమర్శిస్తుంటారు. ఆ మాట కృతి సనన్‌కు వర్తించదు. ఎందుకంటే తను ప్రపంచాన్ని చదివింది. జీవితంలో ఎత్తుపల్లాలు చూసింది. బాధ్యతల మధ్య పెరిగింది. కాబట్టే, కృతి మాటల్లో లోతు ఉంటుంది. ఆ భావాల్లో గాఢత అర్థమవుతూనే ఉంటుంది. తన ‘కార్వాన్' కబుర్లలోనూ ఆ పరిణతి ప్రతిబింబిస్తుంది.
Kriti Sanon | సినిమా తారలు గ్లామర్ బొమ్మలనీ, వాళ్లకు ప్రపంచమే తెలియదనీ చాలామంది విమర్శిస్తుంటారు. ఆ మాట కృతి సనన్‌కు వర్తించదు. ఎందుకంటే తను ప్రపంచాన్ని చదివింది. జీవితంలో ఎత్తుపల్లాలు చూసింది. బాధ్యతల మధ్య పెరిగింది. కాబట్టే, కృతి మాటల్లో లోతు ఉంటుంది. ఆ భావాల్లో గాఢత అర్థమవుతూనే ఉంటుంది. తన ‘కార్వాన్’ కబుర్లలోనూ ఆ పరిణతి ప్రతిబింబిస్తుంది.
నన్ను భయపెట్టే పాత్రలంటే నాకు ఇష్టం. ఆ భయంలో ఓ సవాలు ఉంటుంది. భయాన్ని గెలిచినట్టుగానే సవాళ్లనూ అధిగమిస్తాను. ఇప్పటివరకూ ఎవరూ తీయని కోణాలు, ఎవరూ ఊహించని ఇతివృత్తాలు నాకిష్టం.
నేను ఎంచుకునే ప్రతి సినిమా నా జీవితంలో ఒక మలుపే. పదేండ్ల క్రితం వచ్చిన ‘హీరో పంతి’ ఒక టర్నింగ్ పాయింట్ అయితే, ‘ఆదిపురుష్’ మరో మలుపు. జీవితమంటే.. ఇలాంటి అనేకానేక మలుపుల సారమే. ఆ ఆశయం ఒకటే. మంచి నటిగా నన్ను నేను నిరూపించుకోవాలి. అంతకుమించిన కోరికలు లేవు.

అభిమానులంటే నాకు చాలా ఇష్టం. నా పుట్టినరోజు సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో గ్రీటింగ్స్, గిఫ్ట్స్ అందుతాయి. వాటిలో నేను ఖరీదు చూడను. అందులోని ప్రేమను ఇష్టపడతాను. కొంతమంది అభిమానులు చేతితో చేసిన కళాఖండాలు పంపుతారు. అవన్నీ జాగ్రత్తగా దాచుకుంటాను.
కొన్నిసార్లు ఓటమి తప్పదు. దాన్ని ఓ పాఠంగా తీసుకోవాలి తప్పించి.. ఆ చేదు అనుభవాన్నే తలుచుకుంటూ కూర్చోవడం సరికాదు. మొదటి ఫొటోషూట్ సమయానికి నా మీద నాకే నమ్మకం లేదు. ఏడుపు వచ్చేసింది. ఇంటికి పారిపోదామనిపించింది. అంతలోనే తమాయించుకున్నాను. కాబట్టే, పరిశ్రమలో నిలదొక్కుకున్నాను.
ఎనర్జీ అనే మాటను నేను నమ్ముతాను. లక్ష్యం కోసంపాజిటివ్ ఎనర్జీని ధారపోసినప్పుడు ఫలితం కూడా పాజిటివ్‌గానే ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీతో మొదలుపెడితే.. ఫలితమూ నెగెటివ్‌గానే ఉంటుంది.

నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా.. మా అమ్మను తలుచుకుంటాను. ఆమెకు చదువంటే ప్రాణం. నేను పొట్టలో ఉన్నప్పుడు పీహెచ్డీ చేసింది. నేను పుట్టాక ఉద్యోగంలో చేరింది. దీంతో తొలిచూలు బిడ్డగా పుట్టుకతోనే నా మీద ఓ బాధ్యత పడింది. ఏ పని అయినా సక్రమంగా చేయాలనే తత్వం అలవడింది.
ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలనుకోవడం మూర్ఖత్వం. అది అసాధ్యం కూడా. సోషల్ మీడియా వ్యాఖ్యానాల్ని నేను పట్టించుకోను. సద్విమర్శను మాత్రం హుందాగా స్వీకరిస్తాను. ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో స్నేహితులు, కుటుంబసభ్యుల మీద ఆధారపడతాను.ఓ ఐదేండ్ల క్రితం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఈ మధ్యలోనిది మనం సాధించిన విజయమే. కాబట్టి, ఏ దశలోనూ నిరాశ పనికిరాదు.

Kriti Sanon4
నా చర్మాన్ని నేను ప్రేమగా చూసుకుంటాను. పొద్దున్నే సూర్యకిరణాలతో వాటికి స్నానం చేయిస్తాను. పడుకునే ముందు.. స్కిన్‌కేర్ లోషన్స్ రాసుకుంటాను. సోషల్ మీడియాలో స్కిన్‌కేర్ టిప్స్ ఎక్కువగా చూస్తాను. దీంతో ఆ తరహా వీడియోలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఫలితంగా స్క్రీన్ టైమ్ పెరిగిపోయింది. తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నా. దేన్నీ దూరంపెట్టొద్దు. అలా అని దేన్నీ వ్యసనంగా మార్చుకోవద్దు.
Read More :
“Kriti Sanon | గ్లామర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కృతి సనన్..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

