Fire @ Mumbai | ముంబై సబర్బన్‌లోని కంజూర్‌మార్గ్ ఈస్ట్‌లో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శ్యామ్‌సంగ్ సర్వీస్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకున్నది. అగ్ని ప్రమాద వార్త తెలియగానే ఎనిమిది ఫైరింజన్లు, నాలుగు వాటర్ ట్యాంక్‌లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం గానీ జరిగినట్లు వార్తలు రాలేదు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ముంబై సబర్బన్ ప్రాంతం నల్లని పొగమబ్బులతో నిండిపోయింది. ప్రమాదానికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.