కొవిడ్ వార్డులో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Covid Ward | పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మెడికల్ కాలేజీలోని కొవిడ్ వార్డులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి ఒక

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మెడికల్ కాలేజీలోని కొవిడ్ వార్డులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి ఒక రోగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేసింది. మృతురాలిని ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లాకు చెందిన సంధ్య రాయ్(60)గా పోలీసులు గుర్తించారు.
కొవిడ్ వార్డులో మంటలు చెలరేగడంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రికి వచ్చిన వారు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిన వార్డును రాధరాణి వార్డుగా గుర్తించారు. అయితే కరోనా విజృంభించినప్పటి నుంచి ఈ వార్డును కొవిడ్ వార్డుగా మార్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదం జరిగిన వార్డులో ఫోరెన్సిక్ విచారణ జరిపిస్తామని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రబీర్ సేన్‌గుప్తా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

