న్యూఢిల్లీ : ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మనేసర్‌లోని సెక్టార్ -6లోని గార్బేజ్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు చెత్త అంతటా వ్యాపించాయి. దీంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. 35 ఫైరింజన్లు సుమారు 6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
#WATCH | Massive fire breaks out in garbage near sector-6 of Manesar in Gurugram district late last night. 35 fire brigade vehicles present on the spot pic.twitter.com/llofnJIkH8
— ANI (@ANI) April 25, 2022