తిరువనంతపురం: అలప్పుళ ఎక్స్ప్రెస్ రైలు (13351) కేరళలోని మధుకరై స్టేషన్ వద్ద శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. ఈ రైలులో శబరిమలకు వెళ్తున్న తెలంగాణ ఇల్లెందుకు చెందిన 10 మంది అయ్యప్ప మాలాధారులు సురక్షితంగా ఉన్నారు.
ఈ రైలు ధనాబాద్ జంక్షన్ నుంచి అలప్పుళ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. బీ4, బీ5 బోగీల్లో మంటలను గుర్తించిన స్టేషన్ సిబ్బంది వెంటనే రైలును నిలిపేశారు. ప్రయాణికులు కూడా ప్రమాదాన్ని గుర్తించి హుటాహుటిన రైలు నుంచి దిగిపోయారు.