Kidneys | ఈ సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే మీ కిడ్నీలు బాగున్నాయో లేదో చెక్ చేయించుకోండి..!
మన శరీరంలో కీలకమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి మన శరీరంలో అనేక కీలక విధులను నిర్వర్తిస్తాయి. రక్తాన్ని శుద్ది చేయడం, రక్తపోటును నియంత్రించడం, శరీరంలో ద్రవాల స్థాయిలను అదుపులో ఉంచడం, ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడం వంటి అనేక విధులను నిర్వర్తిస్తాయి.
Kidneys | మన శరీరంలో కీలకమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి మన శరీరంలో అనేక కీలక విధులను నిర్వర్తిస్తాయి. రక్తాన్ని శుద్ది చేయడం, రక్తపోటును నియంత్రించడం, శరీరంలో ద్రవాల స్థాయిలను అదుపులో ఉంచడం, ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడం వంటి అనేక విధులను నిర్వర్తిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటే మొత్తం శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అయితే మూత్రపిండాలు అనారోగ్యానికి గురైనప్పుడు వాటి లక్షణాలు త్వరగా కనబడవు. సూక్ష్మ లక్షణాల ద్వారా వాటి క్షీణతను తెలియజేస్తాయి. చాలా మంది ఈ లక్షణాలను తేలికగా తీసుకుంటారు లేదా వయసు పైబడడం వల్ల ఇలా జరుగుతుంది అని భావిస్తారు. కానీ ఈ లక్షణాలే కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తాయి. కనుక ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మూత్రపిండాల పనితీరు తగ్గినప్పుడు కనిపించే లక్షణాలను గుర్తించడం చాలా అవసరం. కనుక మూత్రపిండాలు వైఫల్యానికి గురి అయినప్పుడు కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అలసట, మూత్ర విసర్జనలో మార్పులు..
మూత్రపిండాలు అనారోగ్యానికి గురైనప్పుడు అలసట ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాలు వడపోత ప్రక్రియ సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. ఈ విష పదార్థాలు శక్తిని హరించడం వల్ల అలసటగా ఉంటుంది. మూత్రపిండాలు ఎర్రరక్తకణాల ఉత్పత్తికి అవసరమయ్యే ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ ను తగినంత ఉత్పత్తి చేయని కారణంగా రక్తహీనత తలెత్తుతుంది. దీని వల్ల కూడా అలసట ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మూత్రవిసర్జనలో వచ్చే మార్పులు కూడా మూత్రపిండాల సమస్యలను తెలియజేస్తాయి. నురుగు లేదా బుడగలు రావడం, రాత్రి సమయంలో ఎక్కువగా మూత్రవిసర్జన చేయడం, మూత్రంలో రక్తం వంటి లక్షణాలు మూత్రపిండాల అనారోగ్యాన్ని సూచిస్తాయి. మూత్రంలో రక్తం కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం వల్ల ద్రవ సమతుల్యతలో మార్పు వస్తుంది. దీంతో కళ్ల చుట్టూ, పాదాలు, చీలమండలంలో నీరు నిలిచి పోయి ఆయా భాగాలు వాపులకు గురైనట్లుగా కనిపిస్తాయి.
చర్మ సమస్యలు..
మూత్రపిండాల పనితీరు క్షీణించడం వల్ల వచ్చే రక్తహీనత కారణంగా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ ను సరఫరా చేసే సామర్థ్యం తగ్గుతుంది. దీంతో శ్వాస సమస్యలు తలెత్తుతాయి. చర్మం కూడా మూత్రపిండాల సమస్యలను తెలియజేస్తుంది. మూత్రపిండాలు వడపోత సరిగ్గా చేయని కారణంగా విష పదార్థాలు పేరుకుపోతాయి. దీంతో చర్మం దురద, మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. మూత్రపిండాల పనితీరు తగ్గడం వల్ల మానసిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. హృదయ స్పందనల రేటులో మార్పులు వస్తాయి. వీటితో పాటు ఆకలి తగ్గడం, కండరాలు తిమ్మిర్లు రావడం వంటివి కూడా జరుగుతాయి. ఇటువంటి లక్షణాలను గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే వారు మూత్రపిండాల ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. తరచూ మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- health tips
- kidneys
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

