WPL Final : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ విజేత ఎవరో మరికాసేపట్లో తేలనుంది. రెండో సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) అమీతుమీకి తేల్చుకోనుంది. మూడుసార్లు ఆఖరి మెట్టుపై చతికిలపడిన ఢిల్లీ.. ఈసారి కప్‌ను ఒడిసిపట్టాలనే కసితో ఉంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ పోరులో టాస్ గెలిచిన స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకుంది.
గత మూడు సీజన్లలో ఎలిమినేటర్ విజేతనే ట్రోఫీ వరించింది. ఈ సంప్రదాయం కొనసాగితే గుజరాత్ జెయింట్స్‌ను దెబ్బకొట్టి.. ఫైనల్‌కు దూసుకొచ్చిన ఢిల్లీ కప్ కల సాకారమైనట్టే. లీగ్ దశలో చెరొక మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ, ఢిల్లీ.. ఆఖరి పంచ్‌కు సిద్ధమయ్యాయి. బ్యాటర్ గౌతమీ అందుబాటులో లేకపోవడంతో ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ బెంగళూరు తుదిజట్టులోకి వచ్చింది. ఢిల్లీ జట్టు ఏ మార్పులు చేయకుండా ఆడుతోంది.
Here are the Playing XIs of @RCBTweets and @DelhiCapitals for the #Final 🙌
Updates ▶️ https://t.co/9sgUo0YqOI#TATAWPL | #ClaimTheCrown | #RCBvDC pic.twitter.com/wSONndtya7
— Women’s Premier League (WPL) (@wplt20) February 5, 2026
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు : లిజెల్లీ లీ(వికెట్ కీపర్), షఫాలీ వర్మ, లారా వొల్వార్డ్త్, జెమీమా రోడ్రిగ్స్(కెప్టెన్), మరిజానే కాప్, చిన్నెల్లీ హెన్రీ, నికీ ప్రసాద్, స్నేహ్ రానా, మిన్ను మణి, శ్రీ చరణి, నందిని శర్మ.
ఆర్సీబీ తుది జట్టు : గ్రేస్ హ్యారిస్, స్మృతి మంధాన(కెప్టెన్), జార్జియా వోల్, రీచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, నడినే డీక్లెర్క్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్.