నైనిటాల్: నైనిటాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్రిటీష్ కాలం నాటి ఓల్డ్ లండన్ హౌజ్(Old London House) ఆ ప్రమాదంలో దగ్ధమైంది. ఈ ఘటనలో ఓ వృద్ధ మహిళ చనిపోయింది. వారసత్వానికి గుర్తింపుగా ఉన్న ఆ బిల్డింగ్ పూర్తిగా బూడిదైంది. మల్లిటాల్ మార్కెట్ సమీపంలో బుధవారం రాత్రి 9.45 నిమిషాలకు ఓల్డ్ లండన్ హౌజ్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం వరకు ఆ బిల్డింగ్ నుంచి మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం మంటల్ని ఆర్పినట్లు నైనిటాల్ సీనియర్ ఎస్పీ పీఎన్ మీనా తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దేని వల్ల ఆ ప్రమాదం జరిగిందో ఇంకా తెలియలేదన్నారు.
అగ్ని ప్రమాదంలో మృతిచెందిన మహిళను 82 ఏళ్ల శాంతా బిస్త్గా గుర్తించారు. ప్రఖ్యాత చరిత్రకారుడు, పర్యావరణవేత్త డాక్టర్ అజయ్ రావత్ సోదరి ఆమె. తన కుమారుడు నిఖిల్ బిస్త్‌తో కలిసి ఆమె జీవిస్తున్నది. నిఖిల్ అనేక బాలీవుడ్ సినిమాల్లో పనిచేశారు. బర్ఫీ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా చేశాడు. ఆ తర్వాత నైనిటాల్లో ఉంటున్న తన తల్లిని చూసుకునేందుకు అతను ఫీల్డ్‌ను వదిలేశాడు.
ప్రమాదం నుంచి నిఖిల్ సురక్షితంగా బయటపడ్డాడు. తన తల్లిని కాపాడాలని అతను వేడుకున్నాడు. కానీ అతను స్పృహ కోల్పోయాడు.ఓల్డ్ లండన్ హౌజ్ నుంచి పొగ వస్తున్నట్లు ముందుగా ఓ మొబైల్ షాప్ ఓనర్ చూశాడు. అతను ఆ విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు వెంటనే చేరుకున్నా.. భారీగా మంటలు వ్యాపించడం వల్ల దాన్ని అదుపు చేయడం సాధ్యం కాలేదు. సుమారు 40 మంది అగ్నిమాపక సిబ్బంది ఆ మంటల్ని ఆర్పారు. తెల్లవారుజామున 2 గంటలకు మంటలు పూర్తిగా ఆగిపోయినట్లు చెప్పారు.
ఓల్డ్ లండన్ హౌజ్ బిల్డింగ్‌ను 1863లో నిర్మించారు. యునైటెడ్ ప్రావిన్సు పాలన సమయంలో నైనిటాల్ను వేసవి రాజధానిగా డెవలప్ చేశారు. బ్రిటీష్ ఇండియా పాలకులు దీన్ని అడ్మినిస్ట్రేటివ్ డివిజన్‌గా తీర్చిదిద్దారు.
🚨 FIRE TRAGEDY IN NAINITAL
A massive blaze engulfed Nainital’s historic Old London House, a British-era wooden building in Mallital market. The fire spread rapidly, turning the entire area into smoke and flames.
Despite swift action by fire brigades, Army & Air Force support,… pic.twitter.com/EL1kGYyXj2
— Manish Kumar ad 🇮🇳 (@ma427906099) August 28, 2025