థానే: హిందూ మత గురువు రామ్‌గిరి మహారాజ్‌పై ఇవాళ మహారాష్ట్రలోని థానే జిల్లాలో కేసు నమోదు చేశారు. మహమ్మద్ ప్రవక్తతో పాటు ఇస్లాం మతంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాసిక్ జిల్లాలోని సిన్నార్ తాలూకాలో ఉన్న షా పంచేలీ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రామ్‌గిరి మహారాజ్ ఆ వ్యాఖ్యలు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 302 కింద ముంబ్రా పోలీసులు కేసు బుక్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే రీతిలో రామ్‌గిరి మహారాజ్ మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాసిక్‌తో పాటు ఛత్రపతి సాంబాజీనగర్ జిల్లాల్లోనూ రామ్‌గిరి మహారాజ్‌పై కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా ఆ వ్యాఖ్యలు చేసినట్లు మహారాజ్ తెలిపారు. హిందువులు ఐక్యంగా ఉండాలన్నదే తన ఉద్దేశమని, ఏది ఎదురైనా చూసుకుంటానన్నారు. కేసు నమోదు చేశారు కాబట్టి, ఎప్పుడు నోటీసు వస్తుందో ఎదురుచూస్తున్నట్లు రామ్‌గిరి మహారాజ్ తెలిపారు.