రాంచీ: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే(Nishikant Dubey), మనోజ్ తివారీతో పాటు మరికొంత మందిపై జార్ఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేవఘడ్లోని బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రంలోని ప్రధాన గర్భగుడిలోకి ఆ ఎంపీలు చొచ్చుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు 2వ తేదీన ఆ ఎంపీలు మతపరమైన మనోభావాలను గౌరవించకుండా ప్రవర్తించినట్లు కేసులో పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
ఆలయ ప్రధాన పూజారి కార్తీక్ నాథ్ థాకూర్ ఆ ఇద్దరు ఎంపీలపై ఫిర్యాదు చేశారు. ఆగస్టు 2వ తేదీన రాత్రి 8.45 నిమిషాల నుంచి 9 మధ్య వీఐపీలకు కానీ, వీఐపీలకు కానీ ఎంట్రీ లేదు. శ్రావణ మాసం సందర్భంగా ఆ సమయంలో గర్భగుడిలో ప్రత్యేక పూజాలు నిర్వహిస్తుంటారు. ఎంపీలు ఇద్దరూ దూసుకురావడం పట్ల .. బాబా బైద్యనాథ్ మందిర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులతోనూ దురుసుగా ఆ ఎంపీలు ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎంపీలు దూసుకురావడంతో.. అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితులు ఏర్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగస్టు 7వ తేదీన ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. గర్భాలయంలో కంచా జల్ పూజ జరుగుతున్న సమయంలో ఎంపీలు చొచ్చుకు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పూజ నిర్వహించలేకపోయినట్లు ప్రధాన పూజారి ఆరోపించారు.
ఈ ఘటన పట్ల ఎంపీ నిశికాంత్ దూబే తన ఎక్స్‌లో పోస్టు చేశారు. దేవుడిని పూజించినందుకు తనపై కేసు పెట్టారని, ఇప్పటికే తనపై 51 కేసులు ఉన్నాయని, రేపు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లనున్నట్లు నిశికాంత్ తన పోస్టులో పేర్కొన్నారు.
क़ानून व्यवस्था में कोई परेशानी नहीं हो, सीता होटल से पैदल चलकर थाने पहुँचूँगा pic.twitter.com/lwZY7Xlnnr
— Dr Nishikant Dubey (@nishikant_dubey) August 9, 2025