న్యూఢిల్లీ: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ల(IAS Officers)కు .. ఇవాళ కేంద్రం హెచ్చరిక చేసింది. నిర్దేశిత గడువు లోగా తమ ప్రాపర్టీ వివరాలను వెల్లడించాలని, లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేంద్రం తన ఆదేశాల్లో తెలిపింది. వివరాలు పొందుపరచడంలో జాప్యం జరిగితే ప్రమోషన్లు కోల్పోయే అవకాశం ఉన్నట్లు అధికారిక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొన్నది. వార్షిక స్థిరాస్తి వివరాలను వచ్చే ఏడాది జనవరి 31వ తేదీలోగా వెల్లడించాలని ఐఏఎస్ ఆఫీసర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
పే నిబంధనలు వర్తించాలంటే ఐపీఆర్ ఫైలింగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ (డీఓపీటీ) .. జనవరి 2017 నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల కోసం ఆన్లైన్ ఐపీఆర్ ఫైలింగ్‌కు అవకాశం కల్పించింది. స్పారో మాడ్యూల్లో ఆ ప్రక్రియ చేపట్టారు. అయితే జనవరి 31వ తేదీన ఆన్లైన్ మాడ్యూల్ ముగిసిపోతుందని, ఐఏఎస్‌లు అందరూ నిర్దేశిత గడువులోగా తమ ఐపీఆర్ ఫైల్ చేయాలని అన్ని రాష్ట్రాల సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు.