Madhya Pradesh | జీవిత ఖైదీతో జైలర్ పెండ్లి..మధ్యప్రదేశ్‌లో ఘటన
హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరస్థుడిని జైలు మహిళా ఆధికారి వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఫిరోజా ఖతూన్ గతంలో జైలు వారెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో నేరస్థుడు ధర్మేంద్ర సింగ్‌ను కలుసుకున్నారు.
సత్నా: హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరస్థుడిని జైలు మహిళా ఆధికారి వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఫిరోజా ఖతూన్ గతంలో జైలు వారెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో నేరస్థుడు ధర్మేంద్ర సింగ్‌ను కలుసుకున్నారు. ధర్మేంద్ర సింగ్ ఛత్తర్పూర్లోని చంద్లా నివాసి.
2007లో జరిగిన ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఫిరోజా జైలులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ధర్మేంద్ర సింగ్ వారెంట్ సంబంధిత పనులు ఆమె పర్యవేక్షించేవారు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.
తరువాత అది ప్రేమకు దారితీసింది. కాగా 14 ఏండ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న ధర్మేంద్ర సింగ్ ఏడాది క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. అతని సత్ప్రవర్తనను గుర్తించి జైలు అధికారులు అతనిని విడుదల చేశారు. అనంతరం ధర్మేంద్ర సింగ్, ఫిరోజాలు తమ ప్రేమను వివాహంగా మలచుకోవాలని అనుకున్నారు. వీరి వివాహం మే 5న ఛత్తర్పూర్ జిల్లాలో జరిగింది. కాగా సామాజిక భద్రత దృష్ట్యా ధర్మేంద్ర సింగ్ పెండ్లి పత్రికలో తన పేరును మార్చుకున్నాడు. వీరి వివాహం ఆచార సంప్రదాయాల మధ్య జరిగింది. ఈ వివాహానికి ఫిరోజా కుటుంబ సభ్యులు హాజరుకాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

