న్యూఢిల్లీ : తమ పెండ్లికి ఆశీస్సులు అందించాలని గర్ల్‌ఫ్రెండ్ తండ్రిని కోరిన వ్యక్తి వీడియో (Viral Video) నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. మీ అమ్మాయిని జీవితాంతం ప్రేమగా చూసుకుంటానని, మీ అమ్మాయితో పాటు మీ కుటుంబాన్ని తాను అమితంగా ప్రేమిస్తానని యువకుడు చెప్పడంతో ఆ తండ్రి భావోద్వేగానికి గురై కన్నీళ్లు రాల్చడం నెటిజన్లను కదిలిస్తోంది.
This man asked his girlfriend's dad for his marriage blessing. What a guy! 😭😭😭
(🎥:taliarycroft)— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) March 2, 2023
ఈ వీడియోలో కాబోయే అల్లుడితో కలిసి పెద్దాయన కారులో వెళుతుండగా యువకుడు పెండ్లి ప్రస్తావన తీసుకువచ్చి తాను ఆయన కూతురిని ఎంతగా ప్రేమిస్తున్నదీ వివరిస్తాడు. తాను రింగ్ తీసుకున్నానని ఆమెను పెండ్లి చేసుకునేందుకు మీ దీవెనలు అవసరమని కోరతాడు.
తాను మరణించేవరకూ ఆమెను ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొస్తాడు. తన పెండ్లి కోసం ఈ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్ తండ్రి ఆశీస్సులు కోరతాడు..ఇతడు ఎలాంటి వ్యక్తి..! అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.కాబోయే మామా, అల్లుళ్ల వీడియో నెటిజన్ల హృదయాలను తాకుతోంది.
Read More :