Viral News | వింత సంప్రదాయం.. బురదలో గేదెల్లా పొర్లుతూ వరుడికి ఆహ్వానం
Viral News | భారత దేశం (India) భిన్న సంస్కృతులకు నిలయం. వివిధ రకాల మతాల, కులాల, తెగలవారు నివసిస్తుంటారు. అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) ఓ వర్గం వివాహ (Marriage) సంప్రదాయం మరీ విచిత్రంగా ఉంది. వరుడి (Groom)కి స్వాగతం పలికే విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది.
Viral News | భారత దేశం (India) భిన్న సంస్కృతులకు నిలయం. వివిధ రకాల మతాల, కులాల, తెగలవారు నివసిస్తుంటారు. ఒక్కో జాతికి ఒక్కో సంప్రదాయం ఉంటుంది. ఆయా రాష్ట్రాల ప్రజలు.. వారి సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటుంటారు. వివాహాది, ఇతర కార్యక్రమాల్లో భిన్న సంప్రదాయాలను పాటిస్తుంటారు. అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) ఓ వర్గం వివాహ (Marriage) సంప్రదాయం మరీ విచిత్రంగా ఉంది. వరుడి (Groom)కి స్వాగతం పలికే విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది.
పెళ్లి వేడుకల్లో వరుడి (Groom)కి స్వాగతం పలికేందుకు ఎన్నో ఏర్పాట్లు చేస్తుంటాం. ఇంటి ముందు దారిని పూలతో అందంగా అలంకరించడం.. రెడ్, గ్రీన్ కార్పెట్లతో డప్పు వాయిధ్యాల మధ్య ఘనంగా స్వాగతం పలుకుతుంటాం. అయితే ఛత్తీస్‌గడ్‌లో (Chhattisgarh) ఓ వర్గం వారు మాత్రం వరుడికి గేదెలు (buffalo)గా వేషాలు వేసుకుని, బురద (Mud)లో పొర్లుతూ స్వాగతం పలికారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..! మీరు విన్నది నిజమే. ఈ సంప్రదాయాన్ని చూడాలంటే సుర్గుజా (Surguja) జిల్లాకు వెళ్లాల్సిందే మరి.

మాంఝా (Manjha) తెగకు చెందిన భైంసా గోత్ర ప్రజలు వివాహం సందర్భంగా ఇంటికి వచ్చే వరుడిని ఇలానే ఆహ్వానిస్తుంటారు. మైన్‌పట్ నర్మదాపుర్ ప్రాంతంలో ఉండే ప్రజల సంప్రదాయమిది. వధువు సోదరులు గేదెల్లా మారిపోయి.. నడుము వెనుక ఓ తోకను తగిలించుకని బురదలోకి తిగుతారు. గేదెల్లా ప్రవర్తిస్తూ.. బురదలో పడి దొర్లడం.. పోట్లాడటం, పరిగెత్తడం వంటివి చేస్తుంటారు. అనంతరం ఊరేగింపుగా వచ్చిన వరుడికి స్వాగతం పలికి ఇంటికి తీసుకెళ్తారు. తరతరాలుగా వస్తున్న ఈ వివాహ సంప్రదాయాన్ని వారు ఇప్పటికీ కొనసాగిస్తుండటం విశేషం.
Also Read..
Deepika Padukone | అందుకే ధైర్యంగా ఉన్నా.. బికినీ వివాదంపై ఎట్టకేలకు నోరు విప్పిన దీపికా పదుకొణె
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

