Deepika Padukone | ‘నేను క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చాను. కాలేజీ రోజుల వరకు ఎన్నో క్రీడల్లో భాగమయ్యాను. సంక్షోభంలో కూడా దృఢ సంకల్పంతో ఎలా నిలబడాలో క్రీడలు నేర్పిస్తాయి. అందుకే ‘పఠాన్’ చిత్ర వివాదాలు నన్ను ఏమాత్రం కదిలించలేకపోయాయి’ అని చెప్పింది అగ్ర కథానాయిక దీపికా పడుకోన్. ఆమె కథానాయికగా నటించిన ‘పఠాన్’ చిత్రం విడుదలకు ముందుకు ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
‘బేషరమ్ రంగ్’ పాటలో దీపికాపడుకోన్ ధరించిన బికినీ రంగుపై వివాదాలు చెలరేగాయి. తాజాగా ‘పఠాన్’ చిత్ర అద్భుత విజయాన్ని పురస్కరించుకొని దీపికాపడుకోన్ మాట్లాడుతూ ‘నేనూ, షారుఖ్‌ఖాన్ సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లోంచి ఎన్నో కలల్ని మోసుకొని చిత్రసీమలోకి అడుగుపెట్టాం. సినీరంగంలో రాణించాలంటే ఎంతటి కష్టానికి ఓర్చుకోవాలో, ఎన్ని అవమానాల్ని సహించాలో మాకు తెలుసు. వివాదాల సమయంలో మేమిద్దరం పరిణితితో వ్యవహరించాం. అందుకే ఎవరి వ్యాఖ్యలకు స్పందించలేదు’ అని పేర్కొంది.
“పఠాన్ మూవీలో దీపికా పదుకునేను అనుకరించిన ఇన్‌స్టా ఇన్ఫ్లుయన్సర్”