న్యూఢిల్లీ : పఠాన్ మూవీలో దీపికా పదుకునేను అనుకరిస్తూ ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయన్సర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సొనాలికా పూరి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయగా ఇప్పటివరకూ 10 లక్షల మంది పైగా వీక్షించారు. ఈ వీడియోలో ఆమె బ్లాక్‌బస్టర్ మూవీ పఠాన్‌లో దీపిక పోషించిన ఐఎస్ఐ ఏజెంట్ రుబినా పాత్రను అనుకరిస్తూ కనిపించారు.
అయితే దీపికా పదుకునే హావభావాలను ఆమె పలికించలేదని ఈ వీడియోపై నెటిజన్లు పెదవివిరిచారు. ఇక ఈ మూవీలో దీపికా డైలాగులను షార్ట్ క్లిప్‌లో సొనాలిక నోట వినవచ్చు. ఈ సినిమాలో దీపిక కనిపించిన సన్నివేశాలను కూడా సొనాలిక అనుకరించింది.
దీపిక ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సొనాలిక ముఖంలో కనిపించలేదని సరిగ్గా మ్యాచ్ కాలేదని నెటిజన్లు ఈ వీడియోపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు వాయిస్‌తో పాటు ఆమె హావభావాలు, డైలాగ్‌లు పలికిన తీరు ఏ మాత్రం మ్యాచ్ కాలేదని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.