Viral Video | పెండ్లి వేడుకలో డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న చిన్నారి
పెండ్లి వేడుకలో హర్యాన్వి సాంగ్ 52 గజ్ కా దమన్ సాంగ్‌కు ఓ చిన్నారి మెస్మరైజింగ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : పెండ్లి వేడుకలో హర్యాన్వి సాంగ్ 52 గజ్ కా దమన్ సాంగ్‌కు ఓ చిన్నారి మెస్మరైజింగ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్యాన్స్ చేసేందుకు స్టేజి వంటి సౌకర్యం లేకున్నా తానున్న చోటే పాప చేసిన డ్యాన్స్ అక్కడున్న అతిధులందరినీ ఆకర్షించింది.
ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోకు పది లక్షల పైగా వ్యూస్ లభించాయి. చిన్నారి పెర్ఫామెన్స్‌కు అతిధులందరూ పాపపై ప్రశంసలు గుప్పించారు. వారంతా పాప వద్దకు వెళ్లి ప్రశంసాపూర్వకంగా మనీ గిఫ్ట్‌గా ఇవ్వడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది.
ఇక పాప డ్యాన్స్ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారి డ్యాన్స్ పెర్ఫామెన్స్ నెక్ట్స్ లెవెల్లో ఉందని యూజర్లు కామెంట్స్ సెక్షన్లో ప్రశంసించారు. లైక్ ఎమోజీలతో హోరెత్తించారు. చిన్నారి అద్భుతంగా డ్యాన్స్ చేసిందని, పాప తన ట్యాలెంట్‌ను కొనసాగించి మంచి పేరు తెచ్చుకోవాలని ఓ యూజర్ కామెంట్ చేయగా, వెడ్డింగ్ వేడుకలో మహిళలందరూ చిన్నారిని ప్రోత్సహించారని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Viral News | వింత సంప్రదాయం.. బురదలో గేదెల్లా పొర్లుతూ వరుడికి ఆహ్వానం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dance
- Little girl
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

