కోర్బా: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించింది. 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేయడంతోపాటు ఆమె తండ్రిని, నాలుగేళ్ల బాలికను కూడా వీరు హత్య చేసినట్లు రుజువైంది. ఈ కేసులో మరో వ్యక్తికి జీవిత ఖైదు విధించింది.
దోషులు అత్యంత అమానుషంగా, క్రూరంగా ఈ నేరాలకు పాల్పడ్డారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 15న ఈ తీర్పు వచ్చింది, కానీ ఆర్డర్ కాపీ సోమవారం అందుబాటులోకి వచ్చింది. 2021 జనవరి 29న బాలికపై వీరు సామూహిక అత్యాచారం చేసి, రాళ్లతో కొట్టి హత్య చేశారు. బాధితురాలి తండ్రి (60)ని, ఆయన మనుమరాలు (4)ను కూడా హత్య చేశారు.