Jammu Kashmir Elections : దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. హర్యానా, జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు.జమ్మూ కశ్మీర్లో మొత్తం మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.
సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక జమ్ము కశ్మీర్లో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించడంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్ధుల్లా స్పందించారు. ఎన్నికలు నిర్వహిస్తారని తాను ఆశిస్తున్నానని, రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుతీరి సంవత్సరాలు గడిచిపోయాయని వ్యాఖ్యానించారు.
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు ఎన్నికవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల్లో ఒంటరి పోరుకే ఇప్పటివరకూ మొగ్గుచూపిందని, అయితే ఇతర పార్టీలు ఏం నిర్ణయం తీసుకుంటాయనేది తనకు తెలియదని చెప్పారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఫరూక్ అబ్ధుల్లా వెల్లడించారు. జమ్ము కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఫరూక్ అబ్ధుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Harish Shankar | హరీష్ శంకర్‌పై ట్రోల్స్ ఆపండి.. ఇక చాలు!